STORYMIRROR

Midhun babu

Romance Classics

4  

Midhun babu

Romance Classics

కాలక్షేపం

కాలక్షేపం

1 min
5

సాయంత్రం పక్షుల రోజువారీ కబుర్లతో కాలక్షేపం అయిపోతుంది


చెట్ల ఆకుల నిస్సడితో గాలితెమ్మెరల పలకరింపుతో కీచురాళ్ల సవ్వడితో చీకటి పరచుకుంటుంది


వెన్నెల చల్లుతూ రేరాజు పగలబడి నవ్వుతుంటాడు


ఆ నవ్వు లో నన్ను నేను వెతుకుతుంటాను


కొన్ని మాటలు జ్ఞాపకాలుగా అయ్యే ఘడియలకోసం నిరీక్షిస్తుంటాను


ఇసుక తిన్నెలవెంట చేతిలో చేయి వేసి నడుస్తూ ఖాళీ మనసుతో గుప్పెడు నవ్వులు చిలకరిస్తే కొంగునదోపుకోవాలని ఆశ. 


ఊహు!


బిజీ ఫోన్ తో ఒక చేయి జేబులో ... చంద్రుడు ఇంకా అలానే చూస్తున్నాడు కొంటె నవ్వుతో


ఆ చిరు వెలుతురులో గవ్వలు ఏరుకుంటూ చిన్నపిల్లాడు

తనకు నచ్చిన పనిచేస్తూ


నేను అదే పనిచేస్తున్నా ముడి వేసిన అక్షరాలను మాలనుకడుతూ..


Rate this content
Log in

Similar telugu poem from Romance