STORYMIRROR

Dinakar Reddy

Romance Thriller

4  

Dinakar Reddy

Romance Thriller

కాలి అందియలు..

కాలి అందియలు..

1 min
361

ప్రియుని వెతికి

కౌగిలి పొందవలెనని

పాములు తిరుగాడే త్రోవలో

పచ్చని చెట్ల గాలులు

భయపెట్టే మెరుపులు


అన్నిటినీ దాటి

ఆ రహస్య స్థలం చేరుటకు

ప్రయాణిస్తూ ఉంది ఆ అభిసారిక


చటుక్కున తిరిగి చూసిన

కాలి అందియ విడివడినదని తెలిసి

అయిననూ ఆగక

ముందుకు సాగింది


జడివాన

గుండెల్లో హోరు 

అతడి తలపు

ఏది గెలుస్తుంది


చెట్ల కొమ్మలు పట్టుకుని

అడుగులో అడుగు వేస్తూ

ఆమె గమ్యాన్ని చేరింది

మరి ఆమె గమ్యం అతడేనా

అది అతనికి తెలిసేనా..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance