కాదులే
కాదులే
తనెలాగ ఉంటాడొ..చెప్పడం కాదులే..! ఈ మదిని ఎవరికో..ఇవ్వడం కాదులే..! ఇదిప్రణయ గీతమే..తనకొఱకె మౌనమై.. పెదవులిక ఏతీరొ..విప్పడం కాదులే..! ప్రాణమే నిలిచెలే..తనచెంత చేరగా.. ఏ శిలకొ మొక్కుతూ..ఉండడం కాదులే..! నాలోని తనతోనె..భాషణం నేరుగా.. కట్టుకథ లేఖలో..నింపడం కాదులే..! గాలిలో నీటిలో..వెలుగులో మట్టిలో.. అంతటా తానేను..చూపడం కాదులే..! కొండల్లొ కోనల్లొ..లోయల్లొ ఆడేను.. నేపట్టి నీ ఎదుట..ఉంచడం కాదులే..
