క"న"ష్ట జీవి
క"న"ష్ట జీవి
ఎడారి ఎండమావి నా అదృష్టం..!!
ఆ ఎండమావిని అదిమి వుంచేదెలా ??
సముద్రపు అల నా దరిద్య్రం..!!
ఆ అలని ఆపేదెలా ??
ఒడిదుడుకులకు సతమవుతున్న సహనసీలిని..!!
ఆశయ అవకాశాల నడుమ నలుగుతున్న ఆశావాదిని..!!
ఇష్ట కష్టాలకి మధ్య మూలుగుతున్న మధ్యతరగతి వాడిని..!!
ఊహాల లోకంలో ఎగురుతూ విహరిస్తున్న చిరంజీవిని..!!
నోట మాట జారితే క్రోధమవుతుంది..!!
మనసే మౌనమైతే అచేతనమవుతుంది..!!
బ్రతకాలనే ఆశ పొమ్మంటుంది..!!
చావాలనే దైర్యం రమ్మంటోంది..!!
పోవడానికి దారుల్లేవ్..!!
నిలవడానికి నీడల్లేవ్..!!
చేరడానికి గమ్యాల్లేవ్..!!
నిట్టూర్పుకి కన్నీళ్ళేవ్..!!
-✍️సత్య పవన్✍️
