జ్ఞాపకాలు
జ్ఞాపకాలు
రెప్ప వాల్చానీయని జ్ఞాపకాలు
రేయంతా మనస్సునిండా కురిసిపోతాయి
తుమ్మెదలా పరి పరి విధాలా పువ్వుల చుట్టూ పరిబ్రమిస్తున్నట్టు వాలిపోతుంటాయి జ్ఞాపకాలు
మధువును తాగిన మైకంలా తలపిస్తూ ఉంటుంది
తన నుండి వచ్చే ఒక్క పలకరింపు
అందరూ మిడిసిపడకు అంటారు కానీ
ఏకాంతంలో నిమిషమైన తాను పలకరించకుండా ఉంటే కదా నా మిడిసిపాటు తగ్గేది
అందాల నా రేరాజును ఒక్కసారి తేరిపారాచూసి చెప్పండి ఈమాత్రం మిడిసిపాటు నాకు ఉండదేమో మరి
చుట్టూ ఎక్కడా చూడలేని అందగాడు నాకోసమే ఆకాశమునుండి తొంగి చూస్తుంటే తనని చూసి నాకు మీడిసిపాటే కదూ తనున్నాడు నాకోసమని

