జ్ఞాపకాల గంగలోన
జ్ఞాపకాల గంగలోన
జ్ఞాపకాలు గంగలోన..కలపడమే కుదరదులే..!
నీ మనస్సు ఖాళీగా..చేసుకోగ కుదురునులే..!
ప్రేమన్నది ప్రధానముగ..ఒక మాయా నాటకమే..
ఎఱుకలోన ఉన్నావా..ప్రమాదాలు ఉండవులే..!
నవ్వైనా ఏడుపైన..అద్భుతమౌ ఆయుధాలె..
ప్రయోగించు కుశలతయే..అతీతముగ ఉంచునులే..!
ఎన్ని బొమ్మలుంటేనేం..ఆట సాక్షి కావాలోయ్..
బుద్ధి చేతి కీలుబొమ్మ..మనసైతే శాంతములే..!
ఈ మాయా జగతికన్న..ఆత్మబంధు వింకెవ్వరు..
ఈతనువే మౌనగురువు..పాఠాలను నేర్పునులే..!
నామరూప రహితబ్రహ్మ..సకలజీవ దైవతమే..
దివ్యప్రేమ రహస్యమది..ధ్యానముతో అందునులే..!

