జీవనం
జీవనం
ఏ మలుపులోకి వచ్చి ఆగింది జీవనం
అలుముకుంది నా చుట్టూ అంధకారం
కనుల స్వప్నాలు కన్నీటి పాలయినా
నిలచి ఉంది ఇంకా ఈ వ్యర్ధ ప్రాణం
కలత కారు మబ్బులతో మది గగనం నిండినా
ఊపిరాగదు ఇంకా ఏమి చూడాలనో ఈ జీవితం
మనసు విరిగిన జగతి మరు భూమి కాదా
ఆశలే లేక నిర్లిప్తమయింది ఈ పయనం
