STORYMIRROR

Venkata Rama Seshu Nandagiri

Romance Classics

4  

Venkata Rama Seshu Nandagiri

Romance Classics

జీవన సర్వస్వం

జీవన సర్వస్వం

1 min
323

చల్లని ఈ రేయి ఎంత మధురమైనది

మధురమైన భావనలను మేల్కొలిపినది

మేల్కొలిపినది నీ తీయని తలపులను

తలపులలో, మధురోహలలో విహరించితిని

విహరించితిని నీవే నా తోడూ-నీడగా

తోడూ-నీడగా, అందమైన ఊహలే ఊపిరిగా

ఊపిరే నీవుగా, నా సర్వస్వమే నీవుగా,

నీవుగాక ఎవరు నాకు జీవమిచ్చినది,

జీవమిచ్చావు ఎండి మోడైన నా జీవితానికి

జీవితమే ముగిసిపోయే చివరి సమయంలో

సమయానికి సంజీవనివై నింపావు ప్రాణాన్ని నాలో

నాలో నిలచిన ఈ ప్రాణంపై నీవే సర్వ హక్కులు

హక్కులు నాపై, నీకు సమర్పించుకున్నది నేనే

నేనే సమర్పిస్తున్నా భావించి నా జీవన సర్వస్వంగా

సర్వస్వం నీవని భావించిన నను విడనాడవుగా

విడనాడిన నాడు మిగిలేది నా జీవం లేని కాయం

కాయం చివరకు కలిసేది నీవు నడిచే మట్టిలోనన్నది ఖాయం.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance