STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

4  

Midhun babu

Classics Fantasy Inspirational

జీవన పోరాటం

జీవన పోరాటం

1 min
1


వయసు మీద పడినా తరగని

ఆత్మవిశ్వాసం, ముడతలు పడిన

దేహమైనా తప్పని జీవన పోరాటం;

కాయకష్టం చేసి పిల్లలను సాకితే

రెక్కలొచ్చి ఎగిరిపోతిరి ఎవరి

పొట్టకోసం వాళ్ళు ప్రాకులాడుతూ


సందెపొద్దు చేరినాకా ఇక

 కాలంతో పనేముంది ?

ఊపిరి ఆగే వరకు దేహనికి గంజి 

నీరైనా పొయ్యాలికదా !

అందుకే ఓ చిరు వ్యాపారం

బతుకు తెరువుకు భరోసాగా 

చేయూతనిస్తూ-

జీవన సమరంలో అనేక 

అధ్యాయాలూ,ఆటుపోటులు,

తప్పని సమరమే!


స్పూర్తినిచ్చే ఈ చిత్రం

కష్టపడే తత్వానికి నిదర్శనం,

చిరు సంపాదనలో ఆనందం,

ఒకరిపై ఆధారపడని తత్వం ;

చెయ్యిచాచక స్వశక్తిపై నిలబడడం 

ఎందరికో ఆదర్శం కదా!

ఆమె కధ ఓ జీవిత రహదారి 

బ్రతికి చూపుతున్న సూత్రధారి

కాలానికి ఎదురీడి జానెడు పొట్టకై

సగర్వంగా సాగుతున్న పయనం;

ఔరా అనిపించే అవ్వని చూసైనా

స్వయంఉపాధి పాఠాలు నేర్చుకుంటే 

సాపాటు గ్రహపాటు కానే కాదు

స్వయంకృషితో సాగిపో, మిత్రమ


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics