STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

3  

Midhun babu

Classics Fantasy Inspirational

జీవితం

జీవితం

1 min
3

ఆరంభ దశలో నీవు 

అవసాన దశలో నేను 

అమ్మ పేగు తెంచుకుంటూ కళ్ళు తెరిచా 

అమ్మ నామం స్మరిస్తూ కళ్ళు మూశ 

ఊపిరి పోసుకుంటూ జన్మించా 

ఊపిరి వదులుతూ మరణించా 

ప్రాణమే ప్రాయంగా నీవు 

ప్రాణంతో చలగాటం నేను 

అమాయకత్వం నీలో 

అనుభవాల ఘని నాలో 

పుడమిపై బంధం పెంచుకున్న 

పుడమిలో కలిసిపోతు బంధం తెంచుకున్న 

చదవని పుస్తకం నీవు 

చదివిన నిఘంటువు నేను 

చిగురు వేసే ప్రాయం నీది 

వడలి పోయిన దేహం నాది


Rate this content
Log in

Similar telugu poem from Classics