జీవితం
జీవితం
గడిచిపోని జీవితం ఇలా
తీరని కోరికల అలజడులలో
కరిగిపోని కాలం ఇలా
ఎన్నటికీ చేరువకాని
బంధాల కోసం
చూసే ఎదురు చూపులలో
విడిచిపోని దేహం ఇలా
రెప్పలు తెరవని శాశ్వత
నిద్ర కోసం నిరీక్షిస్తూ
కలిసిపోని ప్రాణం ఇలా
తనలో కలుపుకునే పంచభూతాల కోసం
మరణం అంచున నిలుచుని వేచి చూస్తూ

