STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

4  

Midhun babu

Classics Fantasy Inspirational

జీవితం

జీవితం

1 min
2

మాటను కట్టడి చేసిన 

మాయాజాలమంత్రమేదో ఆవహించినట్లు... 

చివరి కలయిక రోజునైనా 

మాటల మల్లెలు వికసించిపోయే!

 

మాటల్ని ఏరుకొనైనా దండగా మార్చి 

నీ హృదయాన్ని అలంకరించింటే బాగుందేమో...

ఇప్పుడు జ్ఞాపకాల కుసుమాలను 

గుత్తులు గుత్తులుగా పండించి రోజూ మాలనల్లి 

శుష్క హృదయంతో 

శూన్యపటానికి అలంకరిస్తున్నా!


జీవిత సాఫల్య ఫథంలో 

ప్రేమనే వసివాడని పారిజాతమొకటి 

పున్నమంటి సంతసాన 

మకరందమొలకబోస్తూ 

మరీ మరీ రమ్మని ఆహ్వానించింది! 

కానీ పిరికితనమనే పూలపై వాలే 

తుమ్మెదంటి నా మనసు 

మాట అనే మట్టిగోడను దాటి ఎగరలేక 

రెక్కలిరిగి మూలబడింది!

 

చివరి వీడ్కోలును నువ్వు 

కనులతో చెప్పేసినవేళ... 

నా పిరికితనంతో నీ హృదయం 

పిగిలిన వస్త్రమే అయిందో...

అసంతృప్తితో అశనిపాతాన్ని  

ఇముడ్చుకున్న ధరణల్లే రోధించిందో!

 

మనిద్దరి ప్రయాణంలో నాది ప్రాగ్దీశయితే  

నీది ప్రతీచీగ్దిశగా మారిపోయింది! 

ఆశువుగా అక్షరాలను రాయగలిగింత సులువుకాదు 

మది నిర్వచించే లిపిని తర్జుమా చేయడం!


ఎక్కడున్నావో నన్ను క్షమించు...

బ్రతుకు బాటలో మరొక్కసారి కనిపించు... 

మౌన సాగరాన్ని మాటల పడవతో జయించి 

అనురాగ రాగాలతో అశ్రుతర్పణం చేస్తా! 

మరొక అవకాశం ఇస్తావు కదూ!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics