జీవితం
జీవితం
చదువులో ఉండిపో.. మదిలోన ఒదిగిపో..!
అలసటను మరచిపో..పనిలోన మునిగిపో..!
లక్ష్యాలు.. గమ్యాలు - ఏవైన ఎంతలే..!
ముందుకే సాగిపో..గతి'లోన కరిగిపో..!
మౌనాల గగనాల - హాసాలు చిందాలి..!
అధరాల ఆగిపో..సడిలోన తరిగిపో..!
హంసలకు విందుగా - నీచూపు కావాలి..!
సాక్షిగా మిగిలిపో - చని'లోన చేరిపో..!
కలలన్ని పక్షులై - మాయమై పోవులే..!
పువ్వల్లె రాలిపో - శృతిలోన కలిసిపో..!

