జీవితం
జీవితం
చీకట్లను తరుమునపుడె 'వెలుగం'టే తెలుస్తుంది
బాధలను భవించునపుడె 'బతుకం'టే తెలుస్తుంది
తప్పటడుగు లేయకుండ చిన్నారి నడక నేర్చున...?
తప్పులు సరి దిద్దునపుడె 'గురువం'టే తెలుస్తుంది
పంచభక్ష్య భోజనాలు వృథా చేసి తినలేరు
ఆకలితో ఉన్నపుడె 'మెతుకం'టే తెలుస్తుంది
చేరువనే ఉండి కూడ అయినవారె పట్టించుకోరు
మనిషి దూరమైనపుడే
'అతడంటే' తెలుస్తుంది
కలిమిలోన ధనములను
నీళ్ళల వృథా చేయుదురు
లేమిలోన ఉన్నపడే 'డబ్బంటే' తెలుస్తుంది
జనము లేక జాతరలే ఇలలోనా జరగవులే
కష్టాలు ముసిరితే 'దైవమం'టే తెలుస్తుంది
రైతు భవిత బాగుంటే కూడుకేమి లోటులేదు
అన్నదాత అలిగితే 'సాయ'మంటే తెలుస్తుంది
చిల్లు పడ్డ పచ్చనోటు చెలామణికి నోచలేదు
గౌరవాన్ని పెంచినపుడె 'చదువం'టే తెలుస్తుంది

