జీవితం
జీవితం
తెరలు తొలిగించమని
ఏ మబ్బుతెరలకు చెప్పాలి
నీగూడంగా దాగిన
రహస్యాలను ఏ సృష్టికర్త చెవిలో చెప్పాలి
మనస్సు పడే వేదనను
ఏ నెచ్చలితో కబురంపాలి
కోల్పోయిన బంధాలు
ఎక్కడని వెతకాలి
ఎప్పటికి తిరిగిరానివి అని
తెలిసి కూడా ఎందుకు ఈ సుడిగుండాలు సుడులుగా
మెదడులో తిరుగుతుంటాయి
తనువంతా నిండి
ఆణువణువూ చెప్పాలి
అనుకునే చిన్న మాట ఒక్కటే
నాకెందుకు ఏశిక్ష
అసలు నీకేమవుతానో
ఏబంధాలు ఎందుకు విడిపోతాయో
ఎందుకు కలుసుకుంటాయో
పదిలమైన బంధాలు యేవో
కానివి యేవో తెలుసుకోలేక
ఎందకో ఈ వ్యర్థ కన్నీళ్ల కధ
నిన్నటికి రేపటికి భ్యారేజు వేసుకుని
నిన్న కోల్పోయింది
నేడు లేదని బాధ పడలేక
నేటి అనందాలకు రేపటికి ఆపాదించలేక
సతమతమవుతూజీవించడమ మనిషితత్వమా

