జీవితం
జీవితం
ప్రతి మనిషిలో ఎదుగుదల ఎంతో అవసరం.!!
ప్రతి మనిషిలో మార్పు కూడా అంతే అవసరం!!
ప్రతి ఒక్కరికి
నీవే ఒక ఉదాహరణ కావాలి.
నీ మనసు చంచలమైనది
నీ మనసు ఏకాగ్రత ఉన్నప్పుడే
బురద నీరు లాంటి మనసు
ప్రతి ఒక్కరికి దాహం తీర్చే
స్వేద నీరవుతోంది.
నీలో ఉన్న గాయాలన్నిటిని
చుట్టేసి విసిరేసినప్పుడు
ప్రతిక్షణం నిర్మలం
ప్రతిక్షణం నీలో నువ్వుంటావు.
మొండిగా మౌనంగా సేదించినప్పుడే
జీవితం విలువ తెలుస్తుంది.
జీవిత పుస్తకంలో
అనుభవాలే పాఠం
నీకు తెలుసుకున్నది పరీక్షలు
నువ్వన్నది పరీక్ష ఫలితాలు
