STORYMIRROR

T. s.

Classics Others

4  

T. s.

Classics Others

జీవితం

జీవితం

1 min
448

కొన్ని మంచు పువ్వులు 

కొన్ని అగ్గి రవ్వలు

కొన్ని వెన్నెల పువ్వులు 

కొన్ని నెలవంక నవ్వులు

కొన్ని వేడి నిట్టూర్పులు 

కొన్ని వేసవి గాలులు

కొన్ని తామర మొగ్గలు 

కొన్ని కలువ కన్నీయలు

కొన్ని చెలువ చెంగల్వలు 

కొన్ని చెలుల సింగారాలు

వెరసి.. తీసివేత - కూడికలు..

బ్రతుకు బంధాల సమర పోరాటాలు

జీవనం శంఖు తీర్థాల ప్రవాహాలు

జీవితం యుద్ధ భేరీల రథచక్రాలు

బ్రతుకు పయనం..

జనన మరణాల కావడి కుండలు..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics