STORYMIRROR

Jyothi Muvvala

Abstract Action Classics

4  

Jyothi Muvvala

Abstract Action Classics

జీవిలోని ఆత్ముడే పరమాత్ముడు

జీవిలోని ఆత్ముడే పరమాత్ముడు

1 min
245


అన్నీ ఉన్నా అందరూ ఉన్నా ఒక్కరైపోయే జీవులం 

ఎవరికి వారే లోకమని ఎదలోని గాయాలను చూడలేని స్వార్థపరులం!

కలి ఆవహించి కల్తీ అయినా మనుషులం

పరులలోనే దైవం కొలువైనాడని 

సాయంలోనే దైవత్వం కలదని 

ప్రకృతి నేర్పుతున్న పాఠం గుర్తించలేని అంధులం! 


సేవా గుణమే సద్గుణమని ప్రతి ప్రాణి మాధవుడి రూపమని 

పెట్టే చేతిలోనే పరమాత్ముడు ఉంటాడని

ఈ కట్టెను వదిలిన రోజు కాచేది ఆ పుణ్యఫలితమని  

తుది నీ వెంట ఏ వైభవం రాదని

తెలుసుకోలేని అజ్ఞానులం!


మూగ జీవుల పరిరక్షణ రుణ బంధమని 

మానవత్వమే మదికి ఆభరణమని 

ఈ దేహం ఉట్టి మట్టేనని 

ఆత్మకు మరణం అసాధ్యమని 

ప్రతి జన్మలో సాగే పయనం 

కర్మ ఫలితమని తెలియని మూర్ఖులం!


క్షణికమైన జీవితానికై వంద ప్రణాళికలు రచించే చాణుక్యులం 

చిన్న సాయం చేయడానికి లాభనష్టాలను బేరీజు వేసే మేధావులం

ఆలోచించావా ఎప్పుడైనా? 

ఒకరి కష్టం లోనుంచి దొరికినదే నువ్వు అనుభవిస్తున్న జీవితం !


మానవసేవే సంకల్పంగా కష్టమొస్తే కనిపించే దైవమే కాలేమా?

నాలుక చివర నానుడైపోయే పేరు నీదిగా బ్రతకలేమా ?

 కోరుకుంటే కలగని మార్పు ప్రయత్నిస్తే ఫలిస్తుంది 

సర్వ కోటి ప్రాణుల రక్షణకు నాంది పలుకుతుంది 

ప్రభంజనం సృష్టిస్తుంది !!


జ్యోతి మువ్వల


Rate this content
Log in

Similar telugu poem from Abstract