STORYMIRROR

Kadambari Srinivasarao

Abstract Inspirational

4  

Kadambari Srinivasarao

Abstract Inspirational

జీవ మనుగడకు ఆయువుపట్టు

జీవ మనుగడకు ఆయువుపట్టు

1 min
315

మేఘమాల తన సొత్తును

అత్యంత ప్రేమతో 

మానవలోకానికి ధారాదత్తం చేస్తోంది


ప్రతీ బిందువునూ ఒడిసిపట్టిన

మట్టితల్లి తన గర్భాన దాచి

తన బిడ్డల పేగు తడుపుతోంది


కంపుకొట్టే దేహపు మలిన్యాన్ని

తన స్పర్శతో పునీతం చేస్తూ

స్వచ్ఛతను కట్టబెడుతోంది


చుక్క చుక్కనూ తన పొట్టలో నింపుకుని

పాలుపోసుకున్న పచ్చదనం

నరుడి ఆకలికి అన్నమౌతోంది


దేహ దాహాన్ని తీరుస్తూ

జీవమనుగడకు ఆయువుపట్టుగా నిలుస్తూ

జగతి ప్రగతికి ఆధార చక్రమౌతోంది


ఒడిసి పడితే భవిత ఉందోయ్!

మిడిసిపడితే భస్మాసురుడివేనోయ్!

జ్ఞాన నేత్రం తెరుచుకుంటే జల సంపన్నుడివేనోయ్!



Rate this content
Log in

Similar telugu poem from Abstract