Ramesh Babu Kommineni

Inspirational

4.4  

Ramesh Babu Kommineni

Inspirational

జైజవాన్

జైజవాన్

1 min
22.6K


ప౹౹ 

భరతమాత పుత్రుడా అరరే భవహర ముక్తుడా పుణ్యభూమి సేవలో పుణ్య లోకాలకేగినవాడా ౹2౹


చ౹౹

 దేశమాత సేవలో దేహాన్నీ త్యాగించిన వీరుడా 

లేశమంత వెరువక ఎదురొడ్డి నిలిచిన ధీరుడా ౹2౹


ఊరికేపోదు నీ త్యాగం ఉప్పెనై కదులుతాము ఊరుకునేదిలేదు శత్రువునే చెడనరుకుతాము ౹ప౹


చ౹౹ 

ఎలుకా బల్లులను తినేసి ఇంగితమే లేనివాడు

 చిలుకా పలుకులను పలికేసే దొంగ ద్రోహివాడు ౹2౹


సరిహద్దున చేరి సంకటాలు పెంచే నికృష్టుడూ సరిచేద్దామనా కలిసిరాని పొరుగు వికృతుడూ

౹ప౹ 

చ౹౹ 

మన వీరసైన్యానికి బాసటగాను జై కొడదాము 

ఘన భారతంవైపు చూచిన ఘోరిని కడదాము ౹2౹


దేశ రక్షణ కోసం వీరజవానుతో కలిసి నడుద్దాం 

దశదిశలా వినపడేలా జైజవాన్ అని నినదిద్దాం ౹ప౹


Rate this content
Log in

Similar telugu poem from Inspirational