జాతిపిత
జాతిపిత
శాంతి దూతగా నడచినాడు
కాంతిపుంజమై వెలిగినాడు
మానవత్వము బోధించినాడు
ప్రాణి హింసను నిరసించినాడు.
నీతి తప్పని నేతయతడు
జాతిపితగా మిగిలినాడు
మంచి యన్నది పెంచుమనుచు
మనిషివోలె బ్రతకమనుచు
కొల్లాయిగుడ్డ కట్టి తిరిగి
కుళ్ళునంతట కడిగినాడు.
స్వచ్ఛభారత మే తెచ్చునిదిగో
సౌభాగ్యమని చీపురును తా
చేతిలో బట్టి తుడిచినట్టి
నిరాడంబర నేత యతడు
జాతి కీర్తిని గగనమందు
నెగరవేసి మురిసినాడు
ప్రక్క వారిని దోచుకొనుట
నాశనంబుకు దారి యనుచు
శాంతి యహింసలను పౌరులు
వీడవద్దని బోధ చేయుచు
భావితరపు భవితనిల్పి
బోసినవ్వునుజిల్కుచుండెడి
'బాపు 'మనకు స్మరణీయుడు.
వందనంబులు వందనంబులు
జాతి పితకు వందనంబులు
