జాణ
జాణ


కలల నావవు కదిలే ఊహవు
కనుల ముందే చెదిరే అలవు
ఎదురు చూసినా స్వప్నానివి
ఎదను వదలలేని జాప్యానివి
పూలలో కమ్మని సుగంధానివి
తేనెలో తియ్య మకరందానివి
వెన్నెలలో చల్లని తెల్లదనానివి
పకృతిలో నిత్య ప్రమోదనానివి
ఆకృతికే అఖండ అమోఘినివి
కృతి మది కదలించే శతఘ్నివి
కృతజ్ఞతతో కదలే అభిసారికవి
మనసులోని ఆ నిండైన కోరికవి
మమతల సహృదయోల్లాసినివి
సరససల్లాపాలతో సహవాసినివి
అనురాగాలు అందిచే కోయిలవి
ప్రేమానురాగాలు పెంచే కోవెలవి
కనుసైగలతో ఆశే పెంచే ప్రేరణవి
కలలోకవ్వించి నడిపించే జాణవి