Krbabu Kommineni

Drama

4.8  

Krbabu Kommineni

Drama

జాబిలి

జాబిలి

1 min
433


ప౹౹

వెన్నెల ఏకాంతమే కలసిరాదా తీర్చ కోరికను

వన్నెలు ఆసాంతమే అలసి అలగినే మరికను ౹2౹


చ౹౹

జాము రాతిరైన కనపడవు జాలి లేని జాబిలి

రాము రామని చుక్కలే చేసే చీకటితోఅల్లిబిల్లి ౹2౹

మునిపే పంచుకున్న మురిపాలే జల్లుగకురిసె

తనపై పెంచుకున్న ఆ ఆశలు మదిలో మెరిసే ౹ప౹


చ౹౹

ఏల జాగేల ఎదురేగి ఎద మొత్తం మురిపించ

వేల ఊసులే ఎదురుచూసే ఆ కోరిక జరిపించ౹2౹

ఉండిపోరాద గుండెలోగుడి కట్టను గురుతుగ

ఎండిపోనీక ఆ ఎలమినే వేడుకోన ఆతురతుగ ౹ప౹


చ౹౹

కోరిక బలమేమిటో కోరుకొన్న వారికే తెలుసు

చాలిక ఆ మౌనం దరిచేరను చూపకు అలుసు ౹2౹

జ్ఞాపకాల జావళీ జాలీగ జాలువారే జలజలా

వ్యాపకాలే మాని ఓ జాబిలి ఏతెంచవ అలలా ౹ప౹



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్