ఇపుడే
ఇపుడే


ప౹౹
గుండె తలుపులు తెరిచాక గుట్టు ఏముంది
మది తలపులు విరిసాక బెట్టు ఏమంటుంది |2|
చ||
ఎదురొచ్చిన సఖుడు ఇక నే వెళ్లి వస్తానంటే
కలిసొచ్చిన చెలిమి కాదని తిరిగెళతావుంటే |2|
కన్నె మోమూ కన్నీటితో కరిగి తరగదా వన్నె
చిన్నబోయిన మనసుతో చితికినట్లయె కన్నే
|ప|
చ||
ఎన్నాళ్ళని దాస్తావు ఎదలోనే ఉన్న ఆ కోరికే
ఎన్నేళ్ళని మోస్తావూ ఎదురు చూస్తూ ఊరికే |2|
కాగల కార్యం గంధర్వులేమి తీర్చరూ ఇక్కడ
చూడలేని గాంధారి అంధత్వం వద్దూ ఎక్కడ |ప|
చ||
మనసులోని మాట మూటగా విప్పు ఇపుడు
మనసైన వాడిని నీవాడిగా చేసుకో నీవెపుడు ౹2౹
ఓటమన్నది లేదులే ఆ నిజమైన ప్రేమకెపుడు
ఓటమి గెలుపూతెలియని అమరమే ఎపుడు ౹ప౹