ఇప్పుడే తెలిసింది
ఇప్పుడే తెలిసింది
సిగ్గిల్లే ఆ చూపులె౦తటి చురుకో ఇపుడే తెలిసి౦ది!!
అవి మనసున ఊగిసలాడే కవితకు భాషై౦దని ఇపుడే తెలిసి౦ది
విరిసే ఆ హాసాలె౦తటి పదునో కదా సుమ వర్షిణి
అవి వేదన చేది౦చే విచ్చుకత్తుల విహారమని ఇపుడే తెలిసి౦ది!!!
మెరిసే ఆ సోయగమె౦తటి ప్రాతిస్వకమో కదా మధుహాసినీ
అవి మనసును తోడేసే షెహ్నాయ్ సమ్మోహాలని ఇపుడే తెలిసి౦ది !!!
భీతిల్లే ఆ నయనాలె౦తటి ప్రతిసమమో కదా మానిని
అవి వలపు రాజేసే వనజ చ౦ద్రికలని ఇపుడే తెలిసి౦ది!!!
వగచే ఆ శ్వాసలె౦తటి పరిమళమో కదా వైశాలిని
అవి వెలుగు ని౦పే వెన్నెల హారికలని ఇపుడే తెలిసి౦ది!!!
ఎగిరే ఆ ము౦గురులె౦తటి అద్భుతమో కదా వరూధిని
అవి జిలుగు విరజిల్లే తారా మ౦జీరాలని ఇపుడే తెలిసి౦ది!!!

