,ఇంద్ర ధనుస్సు
,ఇంద్ర ధనుస్సు
అందమైనా జీవితంలో ఆశవుందీ చూడగానూ...
ఆకసంలో సప్తవర్ణం దాగివుందీ చూడగానూ..
వాలు చూపే వంతెనేసీ ప్రేమ జల్లై వాలిపోగా..
వెల్లువల్లే పొంగుకొచ్చే అశ్రువుందీ చూడగానూ..
విశ్రమించే రోజునైనా , ఆలపించే గానమేదీ
రాగమాలై రక్తి కూర్చే స్నేహముందీ చూడగానూ.
శోకమైనా ,హాసమైనా లేదు భేదము తేల్చుకోగా,
వాడిపోగా, విచ్చుకోగా గంధముందీ చూడగానూ...
హాయినిచ్చే మాయకన్నా సత్యవాక్కే మేలుకాదా!
మంచి కోరే మాటలోనా మంత్రముందీ చూడగానూ..
