ఈ సిగ్గులు
ఈ సిగ్గులు
నీ సన్నిధి గాకుండా..ఒంపపలేను ఈ సిగ్గులు..!
నవ్వుపూల వాహినియే..దాచలేను ఈ సిగ్గులు..!
నీ తలపుల పూదోటగ..నా తియ్యని భావనయే..
విరహాగ్నికి బలిచేయగ..తలచలేను ఈ సిగ్గులు..!
నీ ముంగిట రంగవల్లి..నా హృదయం ఎల్లప్పుడు..
హారతిగా నీకివ్వక..మోయలేను ఈ సిగ్గులు..!
నీ పాటల సెలయేఱుగ..మారినాను ఏవేళనొ..
మదినేలే సరిగమలే..ఓపలేను ఈ సిగ్గులు..!
కలువపూల పందిరిలా..మనసైనది చూపుటెలా..
లోవెన్నెల చిగురులోయి..చూపలేను ఈ సిగ్గులు..!
వేదనలకు ఆవేదన..నాతోనే నీవుంటే..
నా శ్వాసల సాక్షులివే..నిలుపలేను ఈ సిగ్గులు..!

