ఈ ప్రేమ నాటకం
ఈ ప్రేమ నాటకం
ఈ ప్రేమ నాటకం..ముగిసేది కాదు..!
నీ చెలిమి సంతకం..చెరిగేది కాదు..!
శాశ్వతం ఏదైన..ఉందంటె చెలిమి..
ఊహయే చాతకం..ఆగేది కాదు..!
ఒక స్వర్ణ కలశమే..చూడగా మనసు..
దేనితో మారకం..జరిగేది కాదు..!
పూలెన్నొ పూసేను..రాలేను లెమ్ము..
విరహమే కంటకం..వదిలేది కాదు..!
చీకటే లేదంటె..వినదుగా భయము..
మేల్కొనక జాతకం..మారేది కాదు..!

