STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఈ కన్నులు

ఈ కన్నులు

1 min
353

నీప్రేమను కొలిచేందుకు..చాలవందు ఈకన్నులు..!

నీఒడిలో చేరువరకు..మలగవందు ఈకన్నులు..!


ఆశపడుట తప్పంటే..నొచ్చుకోను ఇంతైనా.. 

నీచూపుల తేనెగాక..గ్రోలవందు ఈకన్నులు..! 


కలనైనా దరికిరావు..మాటాడవు నవ్వుతావు..

మదినేలే దొరనీవని..తెలుపవందు ఈకన్నులు..! 


తలనిమరగ చిరుగాలిగ..ఏవేళకు వచ్చేవో.. 

ఎదురుతెన్ను లేమాత్రం..ఓపవందు ఈకన్నులు..! 


నా వెచ్చని ఊపిరికే..ఊపిరనగ నీధ్యాసే.. 

ఆపదలో సంపదలో..తెలియవందు ఈకన్నులు..! 


నీదయతో పారిజాత..వనసీమగ..మిగిలితినే.. 

నీ పదములు గాకేమీ..చూడవందు ఈకన్నులు..!


Rate this content
Log in

Similar telugu poem from Romance