ఈ కన్నీటి చుక్క
ఈ కన్నీటి చుక్క
ఎందుకో కొందరికి కన్నీటి చుక్కలుచూసినా
మనస్సు చలించదు మన మాట వినిపించదు!!
వెక్కి వెక్కి ఏడుస్తాము మనస్సుకి కష్టమనిపిస్తే
దుఃఖి దుఃఖి రోధిస్తాము ఎవరైనా దూరమయితే !!
బాధలో అయినా ఆనందంలో అయినా మన స్పందన ఒకటే !!
ఆ స్పందనలో స్పర్శ లా చేరి పంచుకునే చెలిమే ఈ కన్నీటి చుక్క !!
వెచ్చగా చెక్కిలిని ముద్దాడి నువ్వు ఒంటరి కాదు అని గుర్తుచేస్తుంది
మానవత్వాన్ని చూపే మనస్సు ఉందని మనకు తెలియచేస్తుంది !!
ఉప్పొంగే హృదయం ఉందని వేదనతో అది చెబుతుంది భరించే
బాధలో ఓర్పు దాగుందని నేర్పుగా చూపుతుంది !!
మౌనం వహించు వేళ కోఠి ప్రశ్నలకైనా జవాబులా నిలుస్తుంది
పశ్చాత్తాపం చెందిన వేళ చేసిన తప్పును సర్దుబాటు చేస్తుంది !!

