STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఈ జన్మకు ఈ వరమే

ఈ జన్మకు ఈ వరమే

1 min
2

నిన్ను అలా చూస్తూనే..ఉండవలెనని ఉన్నది..! 

ఈ జన్మకు ఈ వరమే..అడుగవలెనని ఉన్నది..! 


ఎన్నిలోకా లున్నవో..పనేలేదు తెలియగా..

నీవె నా లోకమన్నది..చెప్పవలెనని ఉన్నది..! 


ప్రేమించే తీరేమో..పాఠమెలా నేర్వగా.. 

నీ చెలిమికి అద్దంలా..నిలువవలెనని ఉన్నది..! 


మనసులోని అలజడితో..తడబడెనా అడుగులు.. 

నీ చూపుల నీడపట్టు..చేరవలెనని ఉన్నది..! 


నీవు-నేను ఒక్కటైన..కనిపింతుము ఎవరికి.. 

ఏకాంతపు గగనమందు..తేలవలెనని ఉన్నది..! 


ఆశపడే ముచ్చటేమి..మిగిలిలేదు నాలో.. 

'నేను-నాది' సమర్పణము..చేయవలెనని ఉన్నది..!


Rate this content
Log in

Similar telugu poem from Romance