ఈ భావం
ఈ భావం
చూడాలని ఉంది నిన్ను
నా కంటి వెలుగులా ,
చేరాలని ఉంది నిన్ను
నా చెంత నీవు లేని సమయంలో,
నడవాలని ఉంది నీతో
నీ నీడ నేనై నా అడుగు నీవై.
చెప్పాలని ఉంది
నీ చల్లని తోడు కావాలని
నాలో నీపై కలిగిన ఈ భావం తొలిసారి కాదు నేస్తం
నాలోని ఈ భావం ఊహకు తోలిసారి ప్రాణం పోసిన రోజు మొదలు
నిరీక్షణమే క్షణ క్షణమై నాలో నీ ఫై ప్రేమను పెంచింది

