హరి హరి
హరి హరి
సారధ్యము సల్పుచు సజ్జనుల బ్రోచితివి
పారమార్ధిక విద్య పంచంగ వచ్చితివి
దుష్ట జన శిక్షకుడ! దోషగుణహారకుడ!
కష్టముల పోద్రోలు కాల పరిపాలకుడ!
బాధలను దిగమ్రింగి పాదములు పట్టితిని
సాధనలు సల్పితిని సన్నిధికి చేరితిని.
రావేల నా దరికి లలిని చూపగ రావ!
జీవంబు నేనిల్పి చింత బాపగ రావ!
శ్రీకాంత!నీకొఱకు చింతిల్లితిని రావ!
నాకింత వరమిచ్చి నన్నాదుకొన లేవ!
వేరుగాతల్చకయ!బేలనైతినిచూడు!
సారెకునిను గొల్చెద సంశయంబులు వీడు!
నీ పాదపద్మముల నే నమ్ము కొంటినయ!
నాపాప మెద్దియో నాకిపుడు తెల్పవయ!
సారసాక్షా!నన్ను సాధించ బోకయ్య!
కారణంబులుతెల్పి కరుణించ రావయ్య!
