STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

హృదయం

హృదయం

1 min
220

కాలాన్నే మధువులాగ..త్రాగుతోంది హృదయం..!

చెలిమదినే ఊయలగ..కోరుతోంది హృదయం..! 


మౌనపు రుచి మాటలలో..నింపుకునే దెలాగో.. 

తన కమ్మని గాత్రంతో..పాడుతోంది హృదయం..! 


వెన్నంటే నడుస్తున్న..చందమామ మనసేమొ..

తన స్నేహం మరువద్దని..తెల్పుతోంది హృదయం..! 


చిక్కులెన్ని ఎదురైనా..తొలగించే జాణ కథ..

ప్రతిశ్వాసకు సాక్షి తానై..వెలుగుతోంది హృదయం..! 


ఏ మెఱుపుకు ఏ గంధం..బహుమతిగా ఇచ్చునో.. 

శాంతిపూల వనమేదో..పెంచుతోంది హృదయం..! 



Rate this content
Log in

Similar telugu poem from Romance