హృదయము
హృదయము
చప్పుడు చేయగ..ఉండదు ఇష్టము..!
తలపుల చెట్టున..నిలువదు హృదయము..!
దొరకవు కనులకు..కలలో నైనా..
కనుపాపలతో..తప్పదు కలహము..!
వీడని గంధం..ఊహల నదిలో..
నవ్వుల వనమున..తెలియదు కాలము..!
అడవిని కురిసే..ఎఱ్ఱని వెన్నెల..
చీకటి భయమే..ఎఱుగదు చిత్రము..!
నామది కోవెల..వెలిగే ప్రేమా..
మిఠాయి మనసే..కట్టదు పొట్లము..!
అతిశయ మేదో..లొంగదు పొగడగ..
మధురం నామం..మరువదు రూపము..!

