హృదయమనే నిజసమాధి
హృదయమనే నిజసమాధి
ఎపుడు తొంగిచూసినావొ..ప్రేమనదిగ మారినాను..!
ఏల మదిని నిండినావొ..చెలిమివనిగ మిగిలినాను..!
మాటలన్ని ముళ్ళేనని..అనడమెంత నిజమోమరి..
నీ చూపుల పూలవాన..తడవకనే తడిసినాను..!
మనసు రాయి చేసుకునే..బ్రతకాలా మనిషైతే..
కఠినమైన వాస్తవమే..నీ దయతో ఎఱిగినాను..!
ఊహమాటు నిలిచి అలా..ఊరించే కోమలాంగి..
ప్రేమలేఖ ఇవ్వాలని..వ్రాసి దాచి ఉంచినాను..!
ఈ ఊపిరి ఊయలెంత..సుందరమో చెప్పాలా..
జన్మలెన్నొ విరహమధువు..సేవనలో గడిపినాను..!

