STORYMIRROR

VENKATALAKSHMI N

Abstract Fantasy Others

4  

VENKATALAKSHMI N

Abstract Fantasy Others

హృదయకవాటం

హృదయకవాటం

1 min
184


కవితా!ఓ కవితా!

ఏ శుభ ముహుర్తాన

నిను స్వాగతించానో

నా స్వగతమే నీవయ్యావు


ఏ క్షణాన నను

నీవు ఆవహించావో

నా అణువణువు

ఆవాహనం అయ్యావు


ఏ బాధలో నాదరి చేరావో

నా ఓదార్పు నీవయ్యావు


ఏ ఏకాంతాన నను

కావలించావో

నా మనసును హత్తుకున్నావు


ఏ కష్టకాలాన నా చేయందుకున్నావో

నా సైన్యం నీవై నడిపిస్తున్నావు


ఏ ఒంటరి యాతనలో నా అక్కున

చేరావో

నా సుగంధపు గ్రంధాలయమై

దారి చూపుతున్నావు


ఏదారి లేక గోదారే గతి అని

నిరాశావహించిన క్షణాన

ఏ దిక్కు నుండి ఏతెంచావో

నా దిక్కే నీవై ఓ దారి చూపావు


గమ్యం గమనం లేక

అగమ్యగోచరమైన నా జీవితనావకు

చుక్కానిలా మారి

ఓ గొప్ప మలుపు తిప్పి

జీవిత పరమార్థానికి

అర్థంలా మారావు


ఏ మనిషీ చేయని

సాయమందించి

నా బ్రతుకుకు అర్థం

చెప్పిన "కవితా!ఓ కవితా!"

నీకివే అక్షర లక్షల నీరాజనాలు


 



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract