❤️❤️ హృదయ స్పందన ❤️❤️
❤️❤️ హృదయ స్పందన ❤️❤️
నిన్ను చూసిన క్షణం నా మనసు పడిన ఆరాటం
నాదగ్గరకు వస్తున్న క్షణం నాగుండెల్లో పెరిగిన అలజడి
నాతో మాట్లాడిన ఆక్షణం మాటలురాక మూగబోయిన నాస్వరం
నాతో గడిపిన క్షణమంతా మర్చిపోలేని మధుర జ్ఞాపకం
నీవు దూరమౌతున్న ఈక్షణం నాహృదయం పడిన ఆవేదన
నీవులేని క్షణం నుంచి నీ రాకకోసం కొవ్వొత్తిలా కరిగిపోతున్న తనువు
నీ పిలుపు కోసం పరితపిస్తున్న కర్ణములు నిన్ను చూడాలని రెప్ప వేయని నేత్రాలు
క్షణ క్షణం నాలో రగిలే అగ్నిజ్వాలలను నీమాటల పన్నీటి జల్లుతో చల్లార్చు
నా హృదయ పూతోటలో నీవు విహరించవా! చెలీ...

