STORYMIRROR

VENKATALAKSHMI N

Inspirational Others Children

4  

VENKATALAKSHMI N

Inspirational Others Children

గురువు

గురువు

1 min
330

గురువు

అక్షరాలు దిద్దించి

అద్వితీయ జీవితాన్నిచ్చే

ఏకైక వ్యక్తి గురువు..

చేతి రాతను నేర్పించి

తలరాతను మార్చగలిగే శక్తి గురువు..

వృత్తి ని ఉపాధి మార్గం గా కాక

ఊపిరిగా భావించే ఒకే ఒక వ్యక్తి గురువు..

మకిలీ పట్టిన మస్తిష్కాన

అక్షర బీజాలు నాటు హాలిక గురువు..

అజ్ఞాన తిమిరం లో విజ్ఞాన జ్యోతులు వెలిగించేది గురువు..

తప్పొప్పులను నెగ్గుకు వస్తావని భరోసా ఇచ్చేది గురువు..

జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పంచే అద్భుత భాండాగారం గురువు..

విద్యార్థుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచే దిక్సూచి గురువు..

తన కన్నా ఉన్నతంగా ఉండాలన్న నిస్వార్థానికి నిదర్శనం గురువు..

భవిష్యత్తుకు దిశానిర్దేశం చూపే మార్గదర్శి గురువు..

అలాంటి గురువులందరికీ ఆచార్యదేవోభవ అంటూ ప్రణమిల్లుదాం..


Rate this content
Log in

Similar telugu poem from Inspirational