గుర్తెరిగిన గుండె
గుర్తెరిగిన గుండె


ప౹౹
గుర్తెరిగిన గుండెలో గుండుసూదై పొడుస్తుందే
మనసెరిగిన మత్తులో ప్రేమే ప్రేరేణై నడుస్తుందే
౹2౹
చ౹౹
గోడు వినవా గోముగా ప్రేమోపాసననే కథలుగా
మోడువారక మునుపే మోగించై మది కదలగా
౹2౹
అలసిపోయే నిరీక్షణలో సమయమే తెలియదే
కలసిపోయే ఆ క్షణంలో ఎడబాటనేది నిలవదే ౹ప౹
చ౹౹
వారాలు నెలలూ గడిచినా వరసనేది కలపవా
యవారాలు మాని వలపు యజ్ఞము తలపవా
౹2౹
ఇసుమంత దయలేని దండుగ మనసూ నీది
లేశమంత లేఖనీయం కాదూ మరీ తలవనిది
౹ప౹
చ౹౹
కనులు కాయలు కాయగా ఎదురు చూసానే
మునులైన ముచ్చట పడరా రూపం చూసాకే
౹2౹
చెప్పని కాలం చేరువు కాకున్న చెదిరిపోవులే
తప్పని తాళం తమకం వదలి తరలి పోవులే ౹ప౹