STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

గుర్రాలకు కళ్ళెం

గుర్రాలకు కళ్ళెం

1 min
360

కాబోయే పెళ్లి కొడుకు

ఒకటికి రెండు గుర్రాలు కొన్నాడు

అదిలించబోయి బెదిరిన 

పరుగెత్తే గుర్రాలకు పోటీగా వెళ్ళాడు 

కళ్ళెం వేయాలని చూసాడు


కాలంతో సంబంధం లేకుండా

మచ్చిక చేయాలని ప్రయత్నించాడు

బాగానే ఉంది

బాగుంటుంది అనుకొని


ఒక గుర్రాన్ని ఎక్కి

మరో గుర్రపు కళ్ళెం చేతిలో ఉంచుకుని

ప్రయాణం ప్రారంభించాడు


గుర్రాలు ఏం అనుకున్నాయో ఏమో

చెరో వైపు పరుగెత్తి

అతణ్ణి మధ్యలో ఆపేసాయి


పెళ్లి మండపం వైపు

అతను నడక సాగించాడు

కోరికలు ఒక వైపు

మనిషి మరో వైపు

రెండు గుర్రాల్లా అనిపించాయి


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract