Ramesh Babu Kommineni

Romance

4.8  

Ramesh Babu Kommineni

Romance

గుండె సవ్వడి

గుండె సవ్వడి

1 min
488


సాకి౹౹

తెలియని అలికిడి తెలిసి కొంటెనే ఎదలో 

మరువక ముందే రాస్తున్నా అదినే కథలా


ప||

గుండెలోని సవ్వడొకటీ చెప్పెనే గురుతునే

సందడే చేయని ఆ సంగతినే ఏమరుతునే|2|


చ||

మదిలోనే స్వర్గమొకటి మరల కదలివచ్చే

దివిలోని సుఖమంతా దీవించి తానుతెచ్చే|2|

వెన్నెలంతా కలబోసి వెలుగు రూపురేఖలు

వన్నెలన్నీ కలిపేసి ఉరకలేసే కొత్త కోరికలు|ప|


చ||

అందనీ ఆకాశం ఎందుకో మరి దిగివచ్చినే

అందమైన అనుభవమొకటీ తాను ఇచ్చినే |2|

అన్నీ ఆశలు అదనులోనే పదును పెంచెనే

వలపు ఊహలు ఆ ఎద నిండుగా ఉంచెనే|ప|


చ||

ఏదో రాగం ఎదురై ఏ తీరానికో చేరవేసేను

అనురాగం అతిశయించి తనే పెన వేసేను|2|

తీయని తలపే తీరికలోన తీరైన వ్యాపకం

మాయని మమతకు మనసులోనే ప్రాపకం|ప|



Rate this content
Log in