గుండె సడిలో
గుండె సడిలో
గుండెసడితొ తగవులాడ..ముద్దువాడ తగునటనే..!
కన్నులురిమి తరిమేవా..బెట్టువాడ తగునటనే..!
నీ చెక్కిలి కెంత గొప్ప..మోమాటమొ ఎఱుపెక్కగ..
మదిలోయల పరవశించు..సిగ్గువాడ తగునటనే..!
పరువాలను కవ్వించే..పైరగాలి నీ తలపే..
అలుకపూల వానలోన..సొగసువాడ తగునటనే..!
మధురమైన క్రీడావని..మనసేగా ఓ చెలియా..
జతకూడే వేళలోన..వలపువాడ తగునటనే..!
నిప్పులనది ఈదులాట..ఎంత సౌఖ్యమిచ్చేనో..
జలకమాడు సందడిలో..తెఱలువాడ తగునటనే..!

