గుండె గూటిలో
గుండె గూటిలో
గుండెగూటి దివ్వెమాట..మంత్రంలా ఉంది కదా..!
చెలిమిపూల వానపాట..వేదంలా ఉంది కదా..!
తరుముతున్న అలజడేదొ..మాటలకే అందదుగా..
పెదవిచాటు మౌనమేమొ..దీపంలా ఉంది కదా..!
ఆనందపు నిధులెన్నో..ఆ మువ్వల సవ్వడింట..
ఆగి వింటె పలకరింపు..శాస్త్రంలా ఉంది కదా..!
ప్రేమకెంత బలముందో..గాలికెలా తెలియగలదు..
పరవశాల మధువుపంచు..గీతంలా ఉంది కదా..!
చిరునవ్వుల వెన్నెలింటి..సోయగాల మోమేదో..
లోన ఉండి కానరాని..అద్దంలా ఉంది కదా..!
నాది-నేను వింతగొడవ..గొడుగేగా .అమృతంలా ఉంది కదా..!

