గుండె గురుతు
గుండె గురుతు


ప౹౹ గుండెలోన గురుతొకటుంది చూస్తావా ఉండబోయే ఊసులన్నీటినీ చేరుస్తావా ఉండే ఆ కోరికలనూ మళ్ళీ రగిలిస్తావా ౹2౹
చ౹౹ స్వప్నమొకటి చేరదీసి మెల్లగా చెప్ఫింది యత్నమొకటి చేసి ఎడదను గిల్లమంది ౹2౹
ఎక్కడోదాగిన జ్ఞాపకం ఎదనే మరిచింది ఇప్పుడే మొలచిన ఆశనే అది చరిచింది
౹ప౹ చ౹౹ ఊసులే ఊపిరై మనసుకే ఊతమైనదిలే వలపు రాశులే వద్దికతో చైతన్యమైనదిలే ౹2౹
చెలిమి చెంతకూ చెరో అడుగేయమన్నది చెల్లని మదిచెలగాటమే వదిలేయమన్నది
౹ప౹ చ౹౹ అనువు చేసీ ఆకళింపుతో ఆరంభమాయే తనువు గోడు తగ్గించనూ ప్రారంభమాయే ౹2౹
రొండొకటైన మనసులకు ప్రేమలే రెట్టింపేలే రొండో తలపే లేనపుడే ఉండవు పట్టింపులే ౹ప౹