STORYMIRROR

Midhun babu

Romance Fantasy

3  

Midhun babu

Romance Fantasy

గతం గతః

గతం గతః

1 min
6


ఔను నీతో కలసినడచిన దారులు

నీతో మాటాడిన మాటలు

నీతో కలిసి నవ్విన నవ్వులపువ్వులు

నీతో పోగేసుకున్న ఊసులు

నీ చేతిలో చేయి కలిపి చేసుకున్న బాసలు

నీతో పంచుకున్న పచ్చని జ్ఞాపకాలు

నీతో మమేకమైన నా వెచ్చని అనుభూతులు

నీ చుట్టే తిరిగే నా ఆలోచనలు పావురాలు

నీతీయని తలపుల విహంగాలు

మరలి రాని కాలంలో కలిసిపోయిన

ఆ మమతల పెనవేతలు

మనసునిండిన మధుర భావలహరులు

అలసిపోని అనురాగాల ఆనంద విహారాలు

ఎదలోతుల్లో నిండిన నీ మాటల మంత్రాలు

వాడిపోని నీ భావ పరిమళపు వీచికలు

ఇవన్నీ నిదుర లో కన్న కలలేనని

ఎంతగా మనసును చిక్కబట్టుకుని

మాసిపోయిన గురుతులని

మరలిరాని కాలమని అనుకున్నా

ఎంతగా గతం గతః నే ఇదంతాఅనుకున్నా

నిజంలో నీడలై నను వేటాడుతూనే

వేదనల ఎడారుల్లోకి విసిరేస్తున్నాయి



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance