గత స్మృతులను
గత స్మృతులను
మరు మల్లెలు సోయగాలను
పంచగా…
సుమగంధాలు పరిమళాలను
వెదజల్లగా…
వెన్నెల తోడు రాగా
మనసు మాయా
వలయంలో చిక్కుకుని
ఊహలోకంతో ముచ్చటిస్తోంది…
గాలి నడుమ తేలియాడే
గీతమై మారి,
గతస్మృతుల తీరాన
ఆగి నిలిచింది హృదయం.
కలల లోకపు సరిహద్దులు
దాటి వెళ్ళాలని తపనగా,
ప్రతి శ్వాసలో నీ రూపం
రేఖాంశమై వెలుగుతోంది
