గీత గుచ్చం
గీత గుచ్చం


ప౹౹
తొలిరాత్రి చేసిన సంతకం తొలకరి కావ్యం
తొలిచే మదిలో తొందరచేసే హృది భవ్యం ౹2౹
చ౹౹
ఊరించే కితకితలు ఉషారుతో మత్తెక్కునే
వారించే వొద్దికను వదిలెళ్ళమని మ్రొక్కునే ౹2౹
తీరుబడితో తిన్నగా ప్రేమించా తికమకలేన
మరులబడితో మరల నేర్చనే ఆపశోపాలేన ౹ప౹
చ౹౹
తలపు తమకాలే తనువును తన్మయించ
గెలుపు నమ్మకాలే అణవణవు ఆవహించ ౹2౹
మోక్షంకై మోకరిల్లి ఆ కోరికే తెలియజేయా
సూక్ష్మంగా సులువైన మార్గమే చూపలేవా ౹ప౹
చ౹౹
ప్రేమంటే తొలి రాతిరి చేసిన సంతకమేనా
లేదంటే రాశి పూలు రాసిన పరిమళమేనా ౹2౹
వయసులో వలపు పొంగే షరామామూలే
వయస్సుడిగాక నిలిచేది నిజమైన ప్రేమలే ౹ప౹