గాయమనలే
గాయమనలే
రాళ్లు విసిరే పనేమున్నది..పూలు పంచక పోయినా..!
ముళ్ళు పరిచే పనేమున్నది..పండ్లు ఇవ్వక పోయినా..!
సాయమెవరికొ చేయవలెనని..ముచ్చటైతే మంచిదే..
చెట్లు నరికే పనేమున్నది..మొక్క నాటక పోయినా..!
పుస్తకాలను చదివినంతనె..గుణములెట్లా తొలగునోయ్..
నీళ్లు నమిలే పనేమున్నది..నీడ చూడక పోయినా..!
కష్టమంటే ఏమిటంటే..కలతచెందక నిలచుటే..
తోడు చుక్కతొ పనేమున్నది..పెరుగు వాడక పోయినా..!
ధర్మమెవరికి బోధ సేతువు..గాయమసలే మానకున్నది..
గాలినాపే పనేమున్నది..సాక్షి అందక పోయినా..!

