గాలిపటమై..
గాలిపటమై..
గాలిలో నాణెమై తిరుగుటే మిగిలెగా!
ఆఖరున కొకవైపు జారుటే మిగిలెగా!!
గాలిపటమై ఇదీ స్వేచ్ఛంటు తెలిపితిని!
ఏకొమ్మ కోతట్టి చిరుగుటే మిగిలెగా!!
త్రాసుగా సమతనే సాధించి నానంటి!
ఒకరి లాభానికై వంగుటే మిగిలెగా!!
రోజాలె ప్రేమ వారధులుగా భ్రమపడితి!
స్మృతిగ కమ్మల నడుమ దొరకుటే మిగిలెగా!!
పచ్చగా సంతకం ప్రగతికని కలగంటి!
పగబట్టి పాముగా తరుముటే మిగిలెనా!!
దేహ మోహమ్ముతో ఇన్నాళ్లు గడిపితిని!
మోసిరెందరొ తుదకు కాలుటే మిగిలెగా!!
.. సిరి ✍️❤️

